Breaking News

ట్రయిలర్​కూ టికెట్​

సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన ఆర్జీవీ ఆలోచనలు ఎవరి అంచనాలకు దొరకవు. కొత్తగా ఆలోచించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అందుకే ఇన్నేళ్లయినా.. ఎన్ని ప్లాపులు వస్తున్నా ఆయన క్రేజ్​ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ‘పవర్​స్టార్​’ అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా ఎవరిగురించి తీస్తున్నాడో ఎల్​కేజీ పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ చిత్రానికి సంబంధించి త్వరలో ఓ ట్రయిలర్​ రిలీజ్​ చేయబోతున్నాడు. కాగా ఈ ట్రయిలర్​కూ కూడా రూ.25 టికెట్టు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆర్జీవీ. అదేంటీ ట్రయిలర్​కు టికెట్టా?​ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. మీ ఇష్టం ఐతే చూడండి లేదంటే మానేయండి అని రొటిన్​ డైలాగ్​ చెబుతాన్నడట ఈ వివాదాస్పద దర్శకుడు.