న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిరుగులేని బౌలర్‌గా ఎదిగిన టీమిండియా పేసర్ భువనేశ్వర్.. టెస్ట్‌ల్లోకి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో ఆడుతున్న వారంతా బాగా రాణిస్తున్నారని చెప్పాడు. దీంతో తన పునరాగమనం మరింత కష్టమవుతుందన్నాడు. అయినా కచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పాడు.
‘టెస్ట్‌ల్లో ఆడాలని బలంగా కోరుకుంటున్నా. కానీ పునరాగమనం సులువు కాదని తెలుసు. అయినా ప్రయత్నించడంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఇప్పుడున్న పేసర్ల చాలా బాగా ఆడుతున్నారు. వాళ్లను దాటి చోటు సంపాదించాలంటే చాలా శ్రమించాలి. టెస్ట్ ఫార్మాట్ ఎప్పుడూ సవాలే. అందులో రాణిస్తేనే సంతృప్తి లభిస్తుంది. అందుకే టెస్ట్‌లు ఆడాల్సిందే’ అని 2018 జనవరిలో చివరి టెస్ట్ ఆడిన భువీ వెల్లడించాడు. గాయాలతో జట్టుకు దూరమైన భువీ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడు.