Breaking News

టీఆర్ఎస్ తోనే తెలంగాణ సాధ్యమైంది

షార్ట్ న్యూస్

సారథి న్యూస్, గోదావరిఖని: మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌ సాగించిన పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, టీబీజీ కేస్ ఆఫీసులోనూ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకలజనులను ఏకం చేస్తూ 14 ఏళ్ల పాటు గులాబీ పార్టీ అనేక ఉద్యమాలు చేసిందన్నారు. అనంతరం విజయ ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మున్సిపల్ సిబ్బందికి మాస్క్లు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, మిర్యాల రాజిరెడ్డి, జడ్పీటీసీ ఆమూల నారాయణ, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జాహిద్ పాషా పాల్గొన్నారు