న్యూఢిల్లీ: కొంతమంది జూనియర్ క్రికెటర్లకు జన్ ధన్ అకౌంట్లు ఉండడంతో వార్షిక అవార్డులకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేకపోయామని బీసీసీఐ వెల్లడించింది. అయితే బ్యాంకర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని తెలిపింది. ‘కొంతమంది జూనియర్ క్రికెటర్లు బీసీసీఐ వార్షిక అవార్డులను గెలుచుకున్నారు. వాళ్లకు రూ.1.5 లక్షల నగదు పురస్కారం ఇవ్వాల్సి ఉంది. సీనియర్ క్రికెటర్లు అందరికీ జనవరి 11న డబ్బులు పడిపోయాయి. జూనియర్లకు పడలేదు. చాలాసార్లు ట్రాన్స్ ఫర్ చేసి విఫలమయ్యాం. సమస్యను బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లాం.
వాళ్లవి జన్‌ధన్ అకౌంట్స్ కావడంతో డిపాజిట్ పరిమితి రూ.50 వేల వరకు ఉందని చెప్పారు. అందుకే లక్షన్నర డిపాజిట్‌ను తీసుకోవడం లేదు’ అని బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్ ఒకరు వెల్లడించారు. చివరకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో మాట్లాడి సమస్యను పరిష్కరించామన్నారు.జన్‌ధన్ అకౌంట్లను సేవింగ్ ఖాతాల కిందకు మార్చి డబ్బులు చెల్లించామన్నారు.