- పాక్ క్రికెట్ బోర్డు
కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్‌లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్‌లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్‌లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా ఎలాంటి చర్యలు ఉండవ్. మాతో ఆడేందుకు ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా సిద్ధంగా ఉన్నారు.
జులై తొలి వారంలో నాలుగు చార్టెడ్ ఫ్లయిట్స్ లో మేం అక్కడికి వెళ్తాం. కొన్ని రోజుల క్వారంటైన్ తర్వాత మాంచెస్టర్, సౌత్ ఆంప్టన్లో మాత్రమే మ్యాచ్ లు ఉంటాయి. మెడికల్ సిబ్బంది, బయో సెక్యూర్ ఏర్పాట్లు ఉంటాయి’ అని వసీమ్ పేర్కొన్నాడు. టెస్ట్ కెప్టెన్ అజర్‌అలీ, పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు వచ్చే వారం ఈ పర్యటన గురించి చెబుతానన్న వసీమ్ ప్లేయర్లకు కూడా వెల్లడిస్తానన్నాడు.