సారథి న్యూస్, ఎల్బీనగర్: లాక్ డౌన్ సందర్భంగా తెలంగాణలో జిమ్ సెంటర్ల నిర్వహణను పునరుద్ధరించాలని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జిమ్ ఓనర్ల అసోసియేషన్ సభ్యులు ఆదివారం అడాల యాదగిరి, అడాల శ్రీను ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో ప్రతినెలా జిమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, మెయింటనెన్స్, ఎక్యూప్మెంట్ ఈఎంఐలు, కరెంట్ బిల్లులు, ఏసీ బిల్లులు కలుపుకోని రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తుందన్నారు. జిమ్ సెంటర్లు బంద్ చేసినప్పటికీ ఉద్యోగులకు తప్పకుండా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమావేశంలో జిమ్ సెంటర్ల యజమానులు బోడ శ్రావణ్ కుమార్, బుర్ర రవి, ప్రకాష్, వజ్రం రెడ్డి, జ్ఞానేశ్వర్, భాస్కర్ రెడ్డి, తారా రాజ్కిరణ్, జయసింహా పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న అడాల యాదగిరి
- June 7, 2020
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- GYM CENTER
- LB NAGAR
- అసోసియేషన్
- జిమ్ సెంటర్లు
- లాక్డౌన్
- Comments Off on జిమ్ సెంటర్లకు అనుమతివ్వండి