న్యూఢిల్లీ: తన కెరీర్ లో ఆడిన తొలి వన్డేలో జహీర్ ఖాన్ షూస్ వేసుకుని బరిలోకి దిగానని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గుర్తుచేశాడు. ఆనాడు జరిగిన సంఘటనను అతను గుర్తుచేసుకున్నాడు. ‘ఐర్లాండ్‌తో సిరీస్‌కు నేను ఎంపికయ్యా. మ్యాచ్‌కు ముందు రోజు అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను మాత్రం ఓ పక్కన నిలబడ్డా. దీనిని గమనించిన ద్రవిడ్ ప్రాక్టీస్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. ద్రవిడ్ చాలా సీనియర్ కావడంతో భయంతో వణికిపోయా. భయంతో ఏదో చెప్పబోతుంటే.. ఏంటి విషయమని మళ్లీ అడిగాడు. వెంటనే తేరుకుని నా కిట్ బ్యాగ్ ఇంకా రాలేదని చెప్పాడు. అయితే ప్రాక్టీస్ చేయవా? అని ఎదురు ప్రశ్నించాడు. కాస్త ధైర్యం తెచ్చుకుని ఫ్లయిట్ వాడి నుంచి నా బ్యాగ్ ఇంకా అందలేదని చెప్పా. అయితే రేపు మ్యాచ్ ఆడవా? అని ద్రవిడ్ అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు జహీర్ వద్దకు వెళ్లి షూస్ అడిగా. సైజ్ అటు ఇటు ఉన్నా.. బాగానే ఫిట్ అయ్యాయి. అవి వేసుకుని అప్పుడు వన్డే అరంగేట్రం చేశా. ఆనాడు జరిగిన సంఘటనను నా జీవితంలో మర్చిపోలేను’ అని ఇషాంత్ వివరించాడు.
- June 1, 2020
- క్రీడలు
- ISHANTH
- ZAHEERKHAN
- ఇషాంత్
- తొలి వన్డే
- పేస్‌బౌలర్
- Comments Off on జహీర్ షూస్‌తో అరంగేట్రం చేశా