సారథి న్యూస్, హుస్నాబాద్: జర్నలిస్టుల సాధనకు ఉద్యమిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నన్నే అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదన్నారు. హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, ఎల్లయ్య, శ్రీకాంత్, రాంరెడ్డి, మహేశ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శ్రీనివాస్, సంపత్, మురళి, రమేష్, సదానందం, సాజిద్, సతీశ్ కుమార్, రవీందర్, సదానందం, శ్రీకాంత్, సంపత్, ప్రభాకర్, హనుమంత్, హరీశ్ పాల్గొన్నారు.
- June 2, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- TUWJ
- ఐజేయూ
- జర్నలిస్టులు
- Comments Off on జర్నలిస్టుల హక్కుల సాధనకు ఉద్యమం