జర్నలిస్టులు అలర్ట్ గా ఉండండి..
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మీడియా ప్రతినిధులు వార్తలను సేకరించే సమయంలో కరోనా నుంచి జాగ్రత్తలు
పాటించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు.
బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పోలీసుశాఖ తరఫున నాణ్యమైన మాస్క్ లు, శానిటైజర్లను ఆమె పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రబలకుండా చేయడంలో అధికారులు, పోలీసులు ఎంత కృషిచేస్తున్నారో అదేస్థాయిలో మీడియా ప్రతినిధుల కష్టం కూడా ఉందని ప్రశంసించారు.
అయినా కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ మరింత శ్రద్ధచూపాలని సూచించారు. వార్తల సేకరణలో భాగంగా ముంబైలో 70 మంది జర్నలిస్టులు, మరికొంత మంది పోలీసులకు కరోనా సోకడం బాధాకరమని గుర్తుచేశారు. ఈ టైంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ చొరవ పట్ల జర్నలిస్టులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు జక్కీ, బస్వరాజ్, సంతోష్, బండి విజయ్, వెంకటేశ్వర్ రావు, భాస్కరాచారి, భాస్కర్ రావు పాల్గొన్నారు.