సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు బోడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దఅంబర్ పేటకు చెందిన వీరమళ్ల వంశీకృష్ణ, అతని స్నేహితులు దివేష్, శ్రీకాంత్, సతీష్ హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్లకు చెందిన ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరమళ్ల వంశీకృష్ణ మాట్లాడుతూ..19 రోజులుగా నిరుపేదలను గుర్తించి బియ్యం, నిత్యావసర సరుకులు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కృపాకర్, నవీన్ ముదిరాజ్, విజయ్, కిరణ్ పాల్గొన్నారు.
- April 24, 2020
- లోకల్ న్యూస్
- JOURNALISTS
- జర్నలిస్టులు
- వైఎస్సార్ సీపీ
- సరుకులు
- హయత్ నగర్
- Comments Off on జర్నలిస్టులకు సరుకులు పంపిణీ