Breaking News

చైనా నుంచి దిగుమతులు బంద్​

చైనా నుంచి దిగుమతులు బంద్​

న్యూఢిల్లీ: ఇండియా ఇప్పటి నుంచి చైనా పవర్‌‌ ఎక్విప్‌మెంట్‌ను ఇంపోర్ట్‌ చేసుకోదని కేంద్రమంత్రి ఆర్‌‌కే. సింగ్‌ అన్నారు. బోర్డర్‌‌లో చైనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఎక్విప్‌మెంట్‌ను చైనా ‘టార్జన్‌ హార్స్‌’గా ఉపయోగించి పవర్‌‌గ్రిడ్‌ షట్‌డౌన్‌ చేసే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇండిన్‌ కంపెనీలు ఇక నుంచి కచ్చితంగా ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకోవాలని కేంద్రపవర్‌‌ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. సైబర్‌‌ ఎటాక్స్‌ చేసే అవకాశం లేకుండా గవర్నమెంట్‌ చర్యలు తీసుకున్న తర్వాత పర్మిషన్‌ ఇస్తుందని ఆ స్టేట్‌మెంట్‌లో చెప్పారు.

‘ఒక దేశం మన భూభాగంలోకి ప్రవేశిస్తుందంటే సహించలేం. చైనా, పాకిస్తాన్‌ నుంచి మేం ఏమి తీసుకోం. ఆ కంట్రీస్‌ నుంచి మనం ఇంపోర్ట్‌ చేసుకునేందుకు పర్మిషన్‌ ఇవ్వం. వాటిలో మాల్‌ వేర్‌‌ లేదా ట్రోజన్‌ హార్స్‌ ఉండే అవకాశం ఉంటుంది’ అని మంత్రి అన్నారు. టవర్‌‌ ఎలిమెంట్స్‌, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్‌‌ భాగాలు దిగుమతి చేసుకోవడం జాలీగా ఉందని, ఇవి అన్నీ భారతదేశంలోనే తయారవుతాయని మంత్రి అన్నారు. డిస్కం కంపెనీలు చైనా నుంచి ఆర్డర్‌‌ చేయొద్దని ఆత్మనిర్భర్‌‌ భారత్‌ మిషన్‌ కింద చైనా నుంచి ఏ వస్తువు దిగుమతి చేసుకోవద్దని మంత్రి అన్నారు. ఇండియా చైనా మధ్య ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాళ్లను ఆర్థికంగా దెబ్బతీసేందుకు మన దేశంలో టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను బ్యాన్‌ చేసింది. ఇది వాళ్లపై మనం చేస్తున్న డిజిట్‌ స్ట్రైక్‌ అని కేంద్ర మంత్రి రవిశంకర్‌‌ప్రసాద్‌ అన్నారు.