- ఈసీబీ సన్నాహాలు
లండన్: అంతర్జాతీయ క్రికెట్‌ను వీలైనంత తర్వగా గాడిలో పెట్టాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించేందుకు కసరత్తుచేస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. యూకే ప్రభుత్వం అనుమతి కోసం కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఔట్ డోర్ ట్రైనింగ్ మొదలుపెట్టాలని మరో 37మంది క్రికెటర్లకు ఈసీబీ సూచించింది. ఇప్పటికే 18మంది బౌలర్లు గత వారం నుంచే గ్రౌండ్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం జాబితా 55కు చేరింది.
ఫార్మాట్లకు అనుగుణంగా బలమైన జట్లను తయారు చేయాలనే ఉద్దేశంతో క్రికెటర్ల పూల్‌ను పెంచుతున్నామని ఈసీబీ వెల్లడించింది. వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, పేసర్లు జేమ్స్ అండర్సన్, జోఫ్రా అర్చర్, అలెక్స్ హేల్స్, లిమ్ ఫ్లంకెట్, జో క్లార్క్, మొయిన్ అలీ, బెయిర్‌స్టో, బ్రాడ్, బట్లర్, రషీద్, కర్రాన్, విల్లే, బిల్లింగ్స్ ఈ జాబితాలో ఉన్నారు. తమ ట్రైనింగ్ సాఫీగా సాగేందుకు మెడికల్ టీమ్, గవర్నమెంట్‌తో కలిసి పని చేస్తున్నామని ఈసీబీ చెప్పింది.