Breaking News

క్రికెట్ దారెటు..?

- వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం హోల్డింగ్

– వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం హోల్డింగ్

న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికి క్రికెట్ డబ్బుల వనరుగా మారిందని, దీనివల్ల ఆట ప్రతిష్ట మసకబారిపోతోందని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆట వల్ల అందుబాటులో ఉండే ప్రతి పైసాను పిండుకోవాలని చూస్తున్నారని ఆరోపించాడు. కనీసం కరోనా బ్రేక్ లోనైనా క్రికెట్ ఏ దారిలో వెళ్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరాడు.

‘క్రికెట్ పూర్తి కమర్షియల్ అయిపోయింది. దీనివల్ల మనుగడ కష్టంగా మారుతోంది. అందుకే కొంత విరామం ఇవ్వడం మంచిది. కనీసం ఈ టైమ్ లోనైనా ఆట గురించి, దాని అంతరాత్మ గురించి ఆలోచించండి. పరిపాలకులు, ప్లేయర్లు ఏం చేస్తున్నారో చూడండి. మనం వెళ్తున్న దారి సరైందేనా? కాదా? ఓసారి పరిశీలించుకోండి. ఇప్పటికైతే అంతా బాగుందని నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరు డబ్బు వస్తువుగా చూస్తున్నారు. దానికోసమే అతిగా మ్యాచ్ లు ఆడిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదేమోనని నా అభిప్రాయం’ అని హోల్డింగ్ విమర్శించాడు. బ్రాడ్ కాస్టర్లను సంతృప్తి పరిచేందుకు ఖాళీ స్టేడియాల్లోనైనా ఆట ఆడించేందుకు తమ పరిపాలకులు ప్రయత్నాలు చేస్తారన్నాడు. ఇది తప్పు కాకపోయినా.. కొనసాగిస్తే క్రికెట్ కు భవిష్యత్ ఉండదని ఆందోళన వ్యక్తం చేశాడు.