కలకత్తా: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ క్రమంలో క్రికెట్ కూడా గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘కరోనాను చూసి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికైతే వైరస్‌కు మందుల్లేవ్. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఓ ఆరేడు నెలల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. ఒక్కసారి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయి.
మనలో అద్భుతమైన నిరోధకశక్తి ఉంది. కాబట్టి అన్నింటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. క్రికెట్ కూడా మళ్లీ గాడిలో పడుతుంది. కాకపోతే షెడ్యూల్, ఆటలో కొన్ని మార్పులు తప్పకపోవచ్చు’ అని దాదా వ్యాఖ్యానించాడు. ఒకసారి వ్యాక్సిన్ వస్తే.. కరోనా కూడా ఫ్లూ, జాండిస్ లాగా మారిపోతుందన్నాడు. ఈజీగా నయమవుతుందన్నాడు.