Breaking News

క్రాకర్స్ దెబ్బకే ఏనుగు మృతి

తిరువనంతపురం: కేరళలో చనిపోయిన ఏనుగు క్రాకర్స్‌పెట్టిన కొబ్బరికాయ తిన్నదని మన్నర్‌‌కాడ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ‌సునీల్‌కుమార్‌ ‌చెప్పారు. జంతువుల నుంచి పొలాలను కాపాడుకునేందుకు గ్రామస్థులు ఇలాంటివి పెడతారని, పొరపాటున దాన్ని తిన్నదన్నారు. ఆకలితో వచ్చిన ఏనుగు కొబ్బరికాయను పగలగొట్టి బాంబులను తిన్నదని, అందుకే దెబ్బలు తగిలాయని అన్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. వాటి తయారీలో మరో ఇద్దరు కూడా ఉన్నారని, వాళ్ల కోసం గాలిస్తున్నట్లు ఫారెస్ట్‌ ఆఫీసర్‌‌అలీ తెలిపారు.

నదిలోకి దిగేముందు ఏనుగు చాలా రోజులు బయట తిరిగిందని, దాదాపు 20 రోజుల క్రితమే దెబ్బ తగిలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. నొప్పి తట్టుకోలేక చివరికి నదిలోకి దిగి అక్కడే ప్రాణాలు కోల్పోయిందన్నారు. కాగా, గర్భంతో ఉన్న ఏనుగు ఆకలితో గ్రామంలోకి వస్తే పైనాపిల్‌లో పటాకులు పెట్టి తినేందుకు ఇచ్చారని అంతా అనుకున్నారు. కేరళలోని మలప్పురం సమీపంలోని ఓ గ్రామంలో గర్భంతో ఉన్న ఏనుగు నోటికి దెబ్బలు తగలడంతో తట్టుకోలేక నదిలోకి దిగి అక్కడే ప్రాణాలు వదిలింది.