Breaking News

‘కోట‌’లో క‌రోనా పాగా

‘కోట‌’లో క‌రోనా పాగా

నెల్లూరు : దేశ‌వ్యాప్తంగా ప్ర‌జానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న క‌రోనా ఉధృతి అంత‌రిక్ష కేంద్రానికీ పాకింది. నెల్లూరులోని శ్రీహ‌రికోట స్పేస్ సెంట‌ర్‌లో గ‌డిచిన నాలుగు రోజుల్లోనే వంద కేసులు న‌మోద‌య్యాయి. బుధ‌వారం ఒక్క‌రోజే అక్క‌డ 41 మందికి పాజిటివ్ గా తేలింది. షార్ వ‌ద్ద ఏపీ ప్ర‌భుత్వం సంజీవ‌ని బ‌స్సు ఏర్పాటుచేసి ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నా.. వైర‌స్ ఉధృతి మాత్రం కొన‌సాగుతూనే ఉన్న‌ది. దీనిపై నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు మాట్లాడుతూ.. గ‌త మూడు రోజుల్లో షార్‌లో 600 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, వారిలో 61 మందికి పాజిటివ్‌గా తేలితే వారంద‌రినీ ఐసోలేష‌న్‌లో ఉంచామ‌ని తెలిపారు. కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో అంత‌రిక్ష కేంద్రంలో షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తున్నామని చెప్పారు.