టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్
న్యూఢిల్లీ: ప్లేయర్ ప్రదర్శన మెరుగుపడాలంటే కోచ్ తో బలహీనతలను కూడా చర్చించాలని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. కోచ్, ప్లేయర్ మధ్య బలమైన బంధం ఉంటేనే ఇది సాధ్యమవుతుందన్నాడు. ‘మానసిక బలం కావొచ్చు, నైపుణ్యాభివృద్ధి కావొచ్చు.. కోచ్ ఎవరైనా బాగా నమ్మకం ఉంచుకోవాలి. పరస్పర నమ్మకం ఉన్నప్పుడే ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. అప్పుడే ప్లేయర్ తన బలహీనతలు, భయాలు, ఆందోళన గురించి కోచ్‌తో చర్చించగలుగుతాడు. ఇవి బహిర్గతం కావు అన్నప్పుడే ఇలాంటి పంచుకుంటారు. ఇటీవల మెంటల్ కండిషనింగ్ కోచ్‌ల ప్రాముఖ్యం పెరుగుతుంది. వాళ్లు ప్లేయర్లతో చాలా ఎక్కువ సమయం గడుపుతారు’ అని బంగర్ వ్యాఖ్యానించాడు.