Breaking News

కొర్రీలు పెట్టొద్దు..కొనండి

కొర్రీలు పెట్టొద్దు..కొనండి

సారథి న్యూస్, మెదక్: ధాన్యం కొనేందుకు కేంద్రం నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని ఆరోపిస్తూ రైతులు  బుధవారం మెదక్​ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. మండలంలోని వెల్దుర్తి, ఆరెగూడెం గ్రామాల రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు వెల్దుర్తి సహకార సొసైటీ  కొనుగోలు కేంద్రానికి వచ్చారు. తాము పొలం వద్ద శుభ్రంచేసి ధాన్యాన్ని తీసుకొచ్చినా కూడా మళ్లీ కేంద్రం వద్ద మరోసారి శుద్ధిచేయమంటున్నారని ఆక్షేపించారు. 16శాతం తేమతో వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని తెచ్చినప్పటికీ ఇక్కడి అధికారులు మాత్రం 13శాతం తేమ ఉంటేనే తీసుకుంటామని కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి లాక్ డౌన్ ఉన్నందున ఆందోళన చేయడానికి వీల్లేదని, సమస్య ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చూస్తామని నచ్చజెప్పారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు.