Breaking News

కొట్రలో దసరా మహోత్సవం

కొట్రలో దసరా మహోత్సవం

సారథి న్యూస్, వెల్దండ: విజయదశమి మహోత్సవాన్ని నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. చుట్టాలు, బంధువులు, కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లూ సందడిగా మారింది. స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజల అనంతరం జమ్మిచెట్టు వద్దకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆయుధపూజ నిర్వహించారు. శమీ మంత్రం జపించారు. ఈ యేడు తమకు కాలం ఎలా కలిసొస్తుందో.. ఆదాయ వ్యయాలను సరిచూసుకున్నారు. అనంతరం జమ్మి ఆకులు తెంచి.. శనగలు పంచి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వేడుకల్లో గ్రామ సర్పంచ్ ​పి.వెంకటేశ్వర్​రావు, ఎంపీటీసీ రాములు, మాజీ సర్పంచ్ ​పి.జంగయ్య, మాజీ ఎంపీటీసీ కె.కృష్ణయ్య, మాజీ ఉపసర్పంచ్​బి.రామస్వామి, వార్డు సభ్యులు కె.హరిశ్చంద్రప్రసాద్, సిద్ధు, బి.రాములమ్మ, శ్రీనివాసులు, బీజేపీ నాయకులు జె.బాలస్వామి, గ్రామపెద్దలు, టీఆర్ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

జమ్మీ చెట్టు వద్ద పూజలు చేస్తున్న సర్పంచ్​, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు