సారథి న్యూస్, గోదావరిఖని: ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాలకు ప్రతిఘటన సింగరేణి నుంచే మొదలు కావాలని విప్లవ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, ఎంఏ గౌస్, జి.రాములు, బేగ్ పిలుపునిచ్చారు. సోమవారం రామగుండం ఆర్ జీ1 ఏరియాలోని జీడీకే1 గని గేట్ మీటింగ్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టాలన్నారు. 50 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి సిద్ధం చేసిందన్నారు. ఈనెల 10, 11న సింగరేణివ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసుల ఎదుట ధర్నాలు, బొగ్గు గనులపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు.
- June 8, 2020
- కరీంనగర్
- LABOUR UNIONS
- SINGARENI
- కార్మిక సంఘాలు
- జేఏసీ
- Comments Off on కుట్రలను తిప్పికొట్టండి