న్యూఢిల్లీ: భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కిరణ్‌జిత్ కౌర్‌పై నాలుగేళ్ల నిషేధం వేటుపడింది. డోప్ పరీక్షలో విఫలమైనందుకు ప్రపంచ అథ్లెటిక్స్ బాడీ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 15న కోల్‌కతాలో జరిగిన టాటా స్టీల్ 25 కి.మీ. రేస్ సందర్భంగా సేకరించిన కిరణ్‌జిత్ శాంపిల్స్‌లో నిషేధిత డ్రగ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆమెపై ప్రొవిజనల్ సస్పెన్షన్ విధించారు. అదేనెల 17న సేకరించిన రెండో శాంపిల్‌ను …
దోహాలోని వాడా ల్యాబ్‌లో పరీక్షించగా, ‘ఎనోబొసార్మ్’ డ్రగ్‌కు సంబంధించిన అవశేషాలు కనిపించాయి. వాడా రూల్స్ ప్రకారం ఈ డ్రగ్ వాడడం నిషేధం. దీంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించారు. అయితే తొలి శాంపిల్ తీసిన డిసెంబర్ 15 నుంచే ఈ నిషేధం అమల్లోకి రానుంది. టైఫాయిడ్ జ్వరానికి వాడిన మందుల్లో ఈ డ్రగ్ ఉన్నట్లు తనకు తెలియదని కౌర్ తెలిపింది.