Breaking News

కార్మికులను ఆదుకోవాలె

కార్మికులను ఆదుకోవాలె

సారథి న్యూస్, రామగుండం: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులో భాగంగా ఆదివారం గోదావరిఖని చౌరస్తా లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మెండ శ్రీనివాస్, ఐఎఫ్​టీయూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. కరోనా కారణంగా నష్టపోతున్న ఆటో, లారీ, భవన నిర్మాణ, హమాలీ, క్వారీ తదితర రంగాల కార్మికులను ఆదుకోవాలని డిమాండ్​చేశారు. ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, తోకల రమేష్, జి.సత్యనారాయణరెడ్డి, వెంకటస్వామి, ఎం.దుర్గయ్య, నంది నారాయణ, ఎన్.రాజేందర్, కె.ఎల్లయ్య పాల్గొన్నారు.