- కార్మిక సంఘాల జేఏసీ నేతలు
సారథి న్యూస్, పెద్దపెల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు, చట్టాలను కాలరాస్తున్నాయని నిరసిస్తూ.. ఏఐటీయూసీ, సీఐటీయూ ఐఎఫ్ టీయూ తదితర కార్మిక సంఘాల జేఏసీ దేశవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కార్మికుల చట్టాలను రద్దు చేయడం సరికాదన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోతారని, పనికి, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని కోరారు. కార్మికులకు ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు చెల్లించి ప్రమాద జీవితబీమా వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కడారి సునీల్, ఏ.వెంకన్న, జి.జ్యోతి, పూసల రమేష్, శనగల శ్రీనివాస్ శనిగరపు చంద్రశేఖర్, కడారి తిరుపతి, బి.అశోక్ పాల్గొన్నారు.