Breaking News

కానిస్టేబుల్​ కుటుంబానికి సాయం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ పోలీస్‌ కమినషరేట్‌లోని మట్వాడ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో చనిపోయిన కానిస్టేబుల్‌ కె.సదానందం సతీమణి రమాదేవికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్​ వి.రవీందర్‌ చేయూత పథకం కింద రూ.లక్షన్నర చెక్కును శుక్రవారం అందజేశారు. కానిస్టేబుల్‌ కుటుంబ స్థితిపరిస్థితులను కమిషనర్‌ అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వపరం అందాల్సిన బెనిఫిట్స్​ను తక్షణమే అందేలా చూడాలని పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ గౌడ్‌కు సూచించారు.