సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటుచేసింది. కరోనా నివారణకు ఏర్పాట్లు, రక్షణ చర్యలను పరిశీలించేందుకు బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వచ్చారు.
మార్కెట్ లోకి వెళ్లే సమయంలో మామిడి కాయలను రాసులుగా పోసి ఉన్నాయి. వాటిని తొక్కుకుంటూ మిగతా అధికారులు, సిబ్బంది ముందుకెళ్తున్నారు. అయితే అలా వెళ్లడం ఇష్టం లేని కమిషనర్ మాత్రం తన షూస్ ను విడిచి తన చేతులతో పట్టుకుని ఇలా జాగ్రత్తగా ముందుకెళ్లారు. సీపీ గొప్ప మనస్సును చూసి పలువురు ముగ్ధులయ్యారు.