Breaking News

కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు

సారథి న్యూస్, రామాయంపేట: ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని మెదక్​ జిల్లా నిజంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, ఎస్సై ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం వారు మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. వానాకాలం సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు ఫార్మర్స్ కు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు లైసెన్స్ డ్ షాప్ లలోనే సీడ్స్​ కొనుగోలు చేయాలని, వాటికి రసీదులు తీసుకోవాలని సూచించారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కల్తీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.