Breaking News

కరోనా టెస్టులు చేయాల్సిందే : హైకోర్టు

సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేటలో కరోనా టెస్టులు చేయడం లేదంటూ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్ట్ లు చేయాల్సిందేనని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వానికి ఏమైన ప్రత్యేక రాజ్యాంగం ఉన్నదా.. ?అంటూ మండిపడింది.

కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా టెస్టులు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఏప్రిల్ 24 తర్వాత కేవలం 35 టెస్ట్ లు మాత్రమే చేసి రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ గా మార్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడతారా..? అని తీవ్రంగా సీరియస్ అయ్యింది. సూర్యాపేటతో పాటు తెలంగాణ అంతటా టెస్టులు నిర్వహించి జాతీయ సగటును అందుకోవాలని ఆర్డర్ చేసింది. వలస కార్మికుల కోసం తీసుకుంటున్న చర్యల వివరాలు తెలుపాలని కోరింది. ఇప్పటికైనా కరోనా టెస్టులు పెంచడంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.