Breaking News

కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

–టోక్యో గేమ్స్‌ చీఫ్‌ మోరీ వ్యాఖ్య

టోక్యో: వచ్చే ఏడాది వరకూ కరోనా వైరస్‌ కంట్రోల్‌ కాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ పూర్తిగా రద్దవుతాయని గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ యోషిరో మోరీ వెల్లడించాడు. ఇప్పటికే ఏడాది వాయిదాపడిన గేమ్స్ను మరోసారి వాయిదా వేసే చాన్సే లేదని స్పష్టం చేశాడు. ‘అప్పుడెప్పుడో యుద్ధ సమయంలో ఒలింపిక్స్ను రద్దుచేశారు. కానీ ఇప్పుడు వరల్డ్‌ మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఇందులో మనం గెలవకపోతే అన్నీ ఇబ్బందులే. ఒకవేళ వైరస్‌ను పూర్తిగా కట్టడి చేస్తే వచ్చే సమ్మర్‌లో ఒలింపిక్స్ ను నిర్వహిస్తాం. లేకపోతే కంప్లీట్‌గా రద్దవుతాయి. ప్రస్తుతం మానవ జాతి వైరస్‌పై బెట్టింగ్‌ చేస్తోంది’ అని మోరీ పేర్కొన్నాడు.

అయితే గేమ్స్పై మోరీ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత ఆలోచనలని స్పోక్స్‌ పర్సన్‌ మసాటకయా వెల్లడించాడు. రీ షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌ కచ్చితంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. గేమ్స్ను ఏడాది పోస్ట్ పోన్ చేయడంతో అటు అథ్లెట్లు, ఇటు ఐవోసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆలస్యమైనా ఒలింపిక్స్ను నిర్వహిస్తేనే బాగుంటుందని గేమ్స్‌ నిర్వాహకులు, జపాన్‌ గవర్నమెంట్‌ భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా కరోనాపై ప్రపంచానిదే విజయమని అందరికి చాటిచెప్పినట్లుగా ఉంటుందని యోచిస్తున్నారు.

వ్యాక్సిన్‌ వచ్చాకే..

మరోవైపు గేమ్స్‌ నిర్వహణపై జపాన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టకపోతే గేమ్స్‌ నిర్వహణ సాధ్యం కాదని జపాన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హెడ్‌ యోషిటెక్‌ యోకోకురా స్పష్టం చేశారు.

‘గేమ్స్‌ వద్దని మేం చెప్పడం లేదు. కానీ అనువైన పరిస్థితులు లేకపోయినా ఒలింపిక్స్ ను నిర్వహించడం చాలా కష్టంతో కూడిన పని. వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌, డ్రగ్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. వస్తే అందరి ఇబ్బందులు తొలగిపోతాయి. ఒకవేళ జపాన్‌లో కరోనా కంట్రోల్‌ లోకి వచ్చినా గేమ్స్‌ నిర్వహణ కష్టమే. ఎందుకంటే రెస్టాఫ్ వరల్డ్‌ మొత్తం మళ్లీ ఇక్కడి వస్తారు. అప్పుడు ఇన్ ఫెక్షన్స్‌ బెడద మళ్లీ పెరిగిపోతుంది. అందుకే వరల్డ్ వైడ్‌గా కరోనా కంట్రోల్‌ లోకి రావాలి’ అని యోకోకురా పేర్కొన్నారు.

ఇక కరోనా నివారణ కోసం జపాన్‌ గవర్నమెంట్‌ తీసుకుంటున్న చర్యలు నిరాశజనకంగా ఉన్నాయని మరికొంత మంది నిఫునులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై కూడా టయకా స్పందించాడు. ఒలింపిక్స్‌ నిర్వహణపై మెడికల్‌ ఎక్స్ పర్ట్స్ ఇలా మాట్లాడడం చాలా తొందరపాటు చర్య అని విమర్శించాడు. అలాంటి పరిస్థితులు వస్తాయని ఇప్పుడే వ్యాఖ్యానించడం సరైంది కాదన్నాడు.