Breaking News

కరోనాను జయించిన శతాధిక వృద్ధుడు

కరోనాను జయించిన శతాధిక వృద్ధుడు

న్యూఢిల్లీ: కంటికి కనిపించని ఈ మహమ్మారి వృద్ధులు, చిన్నారులకు అంటుకుంటే డేంజర్‌‌ అని డాక్టర్లు హెచ్చరిస్తుండగా.. ఢిల్లీకి చెందిన ఈ 106 ఏళ్ల వృద్ధుడు మాత్రం వ్యాధి నుంచి కోలుకున్నాడు. 70 ఏళ్ల తన కొడుకు కంటే తొందరగా కోలుకుని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌(ఆర్‌‌జీఎస్‌ఎస్‌హెచ్‌)లో చేరిన ఆ పేషంట్‌కు వైరస్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ తొందరగా రికవరీ అయ్యారని హాస్పిటల్‌ వర్గాలు చెప్పాయి.

ఆ వృద్ధుడికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రపంచంలో దాదాపు 40 మిలియన్ల మందిని పొట్టనపెట్టకున్న స్పానిష్‌ ఫ్లూ ప్రబలిందని, అయితే ఆయన దాని బారనిపడ్డారా? లేదా అనే విషయం గురించి క్లారిటీ లేదని సీనియర్‌‌ డాక్టర్‌‌ ఒకరు చెప్పారు. ‘ఢిల్లీలో వందేళ్లు పైబడిన తర్వాత వ్యాధి సోకిన మొదటి వ్యక్తి ఆయనే. 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ గురించి తెలిసి కరోనా బారినపడిన వ్యక్తి కూడా ఇతనే. ఆయన కుటుంబసభ్యులు కూడా వ్యాధి బారినపడ్డారు. కానీ వాళ్లందరికంటే ఈయనే త్వరగా కోలుకున్నారు. ఆయన రెండు మహమ్మారీలు ఉన్న కాలంలో బతికాడు’ అని సీనియర్‌‌ డాక్టర్‌‌ ఒకరు చెప్పారు.