Breaking News

కరెంట్ బిల్లులతో షాక్ లా.?

కరెంట్ బిల్లులతో షాక్ లా.?

సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా సమయంలో కరెంట్ బిల్లుల షాక్ తో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శాఖ ఆఫీసర్లు ఇళ్లల్లోకి రాకుండా బిల్లులు వేయడం సరికాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరోనా ఉధృతి తగ్గే వరకు బిల్లులను విధించకుండా చర్యలు తీసుకుని హుస్నాబాద్ విద్యుత్ డీఈకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు చిత్తారి రవీందర్, కోమటి సత్యనారాయణ, టౌన్ ప్రెసిడెంట్ అక్కు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ వల్లపు రాజు, భూక్య సరోజన్, టౌన్ యూత్ అధ్యక్షుడు పున్న సది, బురుగు కిష్టస్వామి పాల్గొన్నారు.