- బెంగాల్ బ్యాట్స్ మెన్ మనోజ్ తివారీ
ముంబై: బెంగాల్ బ్యాట్స్ మెన్ మనోజ్ తివారీ ఒలింపిక్స్ పై గురిపెట్టాడు. ఏదో ఓ రోజు ఈ మెగా ఈవెంట్ లో బరిలోకి దిగి పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే క్రికెటర్ గా కాకుండా ఓ షూటర్ గా విశ్వక్రీడల్లో విజయం సాధిస్తానని చెబుతున్నాడు. ‘క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత షూటింగ్ పై దృష్టిపెడతా.
ఇందులో నైపుణ్యం సాధించి ఒలింపిక్స్ కు వెళ్లడం మీరు చూస్తారు. క్రికెట్ కాకుండా మరో క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఫిజికల్ ఫిట్ నెస్ లేకుండా షూటింగ్ లో రాణించొచ్చు. ఇప్పుడైతే చాలా బాధ్యతలు ఉన్నాయి. అందుకే టైమ్ కేటాయించలేకపోతున్నా’ అని తివారీ వ్యాఖ్యానించాడు.