న్యూఢిల్లీ: భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక పదవిని చేపట్టనున్నారు. ఐవోసీ ఒలింపిక్ చానెల్ కమిషన్ మెంబర్‌గా బాత్రాను నియమించారు. ఐవోసీ సెషన్, ఐవోసీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఐవోసీ అధ్యక్షుడికి ఈ కమిషన్ సలహాలు, సూచనలు ఇస్తుంది.
గేమ్స్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తనకు మంచి బాధ్యతలు అప్పగించిన ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్కు బాత్రా కృతజ్ఞతలు తెలిపారు. ఐవోసీకి మరింత సేవ చేసేందుకు అవకాశం లభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నారు.