Breaking News

ఐపీఎల్ జరిగి తీరుతుంది

ఐపీఎల్ జరిగి తీరుతుంది

–మై టీమ్ 11 సర్వే

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో క్రీడా ప్రపంచం కుదేలైనా.. ఈ ఏడాది ఐపీఎల్ మాత్రం కచ్చితంగా జరిగి తీరుతుందని 60 శాతం మంది అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరో 13శాతం మంది ఖాళీ స్టేడియాల్లో లీగ్​ ను నిర్వహిస్తారని ఓ సర్వేలో తేలింది. 

‘మై టీమ్ 11’ దాదాపు 10 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది. ఇందులో చాలా మంది వీలైనంత త్వరగా క్రీడలు మొదలవుతాయని ఆశాభావంతో ఉన్నారు. అయితే ఎక్కువ కాలం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​ లు జరుగుతాయని చెబుతున్నారు.

‘2020 ఎండ్‌ వరకు క్రీడలు మళ్లీ మొదలవుతాయని 83 శాతం మంది నమ్ముతున్నారు. అయితే 40 శాతం మంది స్టేడియాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కానీ ఈ సంవత్సరమే ఏదో ఓ సమయంలో ఐపీఎల్​ ను కచ్చితంగా నిర్వహించి తీరుతారని కోరుకుంటున్నారు. అంటే ఐపీఎల్​పై జనాలకు ఇంకా ఆసక్తిపోలేదని తెలుస్తోంది. ఓవరాల్​ గా కరోనాతో ప్రజలపై పెద్దదెబ్బ పడింది. దీంతో ప్రతిఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

క్రీడలకు సంబంధించిన 63 శాతం మంది చాలా తొందరగా క్రీడలు మొదలుకావాలని కోరుకుంటే 20 శాతం మాత్రం మూడు, నాలుగు నెలలు అయినా ఫర్వాలేదని చెబుతున్నారు’ అని సర్వే వర్గాలు పేర్కొన్నాయి.