Breaking News

ఏ కోచ్ అలా చేయడు

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: టీ20లకు ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ ఉండడం సరైందేనని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదన్నాడు. ‘స్పెషలిస్ట్ కోచ్​తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. కోచ్​గా సక్సెస్​ కావాలంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడిన అనుభవం ఉండాలన్నది సరైన వాదన కాదు.

టీ20ల్లో కోచ్ చేయాల్సింది.. ప్లేయర్లలో సానుకూల ధోరణిని పెంచడం. భారీ షాట్స్​ ఆడేలా, లక్ష్యాలు చేరుకునేలా ప్రేరణ, ప్రోత్సాహిస్తే అందిస్తే సరి. ప్లేయర్ ఇందులో విజయవంతమైతే కోచ్​గా కూడా సక్సెస్ అయినట్లే. టీ20ల్లో షాట్లు కొట్టడం నేర్పే పని పని కోచ్​ ది ఎంతమాత్రం కాదన్నాడు. ల్యాప్ షాట్ ఇలా ఆడు.. రివర్స్ ల్యాప్ అలా కొట్టు అని ఏ కోచ్ శిక్షణ ఇవ్వడు. ఇలా చేస్తే ప్లేయర్​ కు కీడుచేసిన వాడవుతాడు. కాబట్టి ఏ కోచ్ అలా చేయడు’ అని గౌతీ పేర్కొన్నాడు. ఎక్కువ మ్యాచ్​లు ఆడిన అనుభవం సెలెక్టర్లకు బాగా ఉపయోగపడుతుందన్నాడు.