న్యూఢిల్లీ: మనుషుల క్రూరమైన చర్యల వల్ల కొన్నిసార్లు విపరీతంగా బాధపడాల్సి వస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేరళలో జరిగిన ఏనుగు ఘనటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గర్భంతో ఉన్న ఏనుగు మరణం తనను కలిచివేస్తోందన్నాడు. ‘మూగజీవులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలు సరికావు. మనం సాయం చేయకపోయినా.. హానీ మాత్రం చేయొద్దు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కేరళలో జరిగింది సిగ్గుమాలిన చర్య అని రైనా అన్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.