Breaking News

ఊరూరా మొక్కలు నాటుదాం

ఊరూరా మొక్కలు నాటుదాం

సారథి న్యూస్, మెదక్: రాష్ట్రంలో పచ్చదనం పెంచి భావితరాలకు బంగారు భవిష్యత్​ను అందించేందుకే ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం పాతూరు, సుల్తాన్ పూర్ గ్రామాలతో పాటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయం, వెంకట్రావునగర్ కాలనీ, పిల్లికొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద కలెక్టర్ ధర్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలని కోరారు.

కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఆర్డీవో శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్​పర్సన్​లావణ్యరెడ్డి, హవేళి ఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్ ఎంపీపీ యమున, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమిషనర్ శ్రీహరి పాల్గొన్నారు.