సారథి న్యూస్, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్ర శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. మృతులను మాచారెడ్డి గ్రామానికి చెందిన బాలనర్సు(38), ప్రేమలత(35)గా గుర్తించారు. మృతులు ఇద్దరికి కూడా పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన వీరు ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
- May 18, 2020
- క్రైమ్
- షార్ట్ న్యూస్
- KAMAREDDY
- SUICIDE
- మాచారెడ్డి
- వివాహితులు
- Comments Off on ఉరివేసుకుని జంట ఆత్మహత్య