సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని తెలంగాణ ఎన్జీవోల సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేడిశెట్టి శ్యాంరావ్, దొంత నరేందర్ డిమాండ్ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో గురువారం ‘ఆలిండియా ప్రొటెస్ట్ డే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం మూడు విడతల కరువు భత్యాన్ని ఫ్రీజింగ్ లో పెట్టడం సరికాదన్నారు. పీఎఫ్, ఆర్డీఏ బిల్లును రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు గాండ్ల అనురాధ, చేగుంట యూనిట్ అధ్యక్షుడు ఎండీ ఫజల్, అల్లాదుర్గ్ యూనిట్ అధ్యక్షుడు దత్తు, పశుసంవర్ధక శాఖ జిల్లా అధ్యక్షుడు శివాజీ, నీటిపారుదల శాఖ జిల్లా అధ్యక్షులు ఎండీ ఇక్బాల్ పాషా, జిల్లా సంయుక్త కార్యదర్శి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘునాథరావు, చిరంజీవులు, వైద్యవిధాన పరిషత్ జిల్లా అధ్యక్షుడు అబ్రహం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
- June 4, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- TELANAGNA
- TNGOS
- ఆలిండియా ప్రొటెస్ట్ డే
- పాత పెన్షన్ సిస్టం
- Comments Off on ఉద్యోగ వ్యతిరేక విధానాలు సరికాదు