Breaking News

ఇంటర్​ పాఠ్యాంశాల్లో మార్పు

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఇంటర్మీడియట్​ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్​బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్​లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్​బోర్డు వర్గాలు తెలిపాయి.