సెయింట్ జాన్స్ (అంటిగ్వా): కరోనా నేపథ్యంలో.. వచ్చే నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు తాము రాలేమని వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ డారెన్ బ్రావో, షిమ్రాన్ హెట్ మెయర్, కీమో పాల్ వెల్లడించారు. దీంతో వీళ్లను పక్కనబెట్టి ఈ సిరీస్ కోసం 14 మందితో కూడిన వెస్టిండీస్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ముగ్గురు క్రికెటర్ల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని విండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) తెలిపింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ బోనెర్, పేసర్ కెమెర్ హోల్డర్ తొలిసారి విండీస్ టీమ్ లోకి వచ్చారు.
బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించే ఈ టెస్ట్ సిరీస్ కు ముందు ప్రతి క్రికెటర్ కు కరోనా టెస్ట్ లు నిర్వహిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్ ప్లేయర్లను కూడా ప్రకటించారు. జులై 8 నుంచి 12 వరకు హంప్‌షైర్‌లో తొలి టెస్ట్ జరగనుంది. తర్వాతి రెండు ఓల్డ్ ట్రాఫర్ట్ (జులై 16 నుంచి 20, 24 నుంచి 28 వరకు) లో జరుగుతాయి.
టెస్ట్ జట్టు: హోల్డర్, బ్రాత్‌వైట్, హోప్, డావ్రిచ్, ఛేజ్, బ్రూక్స్, కార్న్వాల్, నక్రుమా బోనెర్, జోసెఫ్, కెమెర్ హోల్డర్, క్యాంప్‌బెల్, రీఫర్, రోచ్, బ్లాక్‌వుడ్.
రిజర్వ్ ఆటగాళ్లు: ఆంబ్రిస్, జాషువా డా సిల్వా, గాబ్రియెల్, హార్డింగ్, కైల్ మేయర్స్, ప్రీస్టన్ మెక్‌స్వీన్, మార్కినో మిండ్లే, షాన్ మూస్లీ, అండర్సన్ ఫీలిప్, థామస్, జోమెల్ వారికన్.