సారథి న్యూస్, హైదరాబాద్: ఆరోగ్యసేతు యాప్ ను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర జాయింట్ సెక్రటరీ జి.జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ స్టాఫ్ కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. వారివారి కార్యాలయాలకు హాజరయ్యే ముందు స్టేటస్ గమనించాలని కోరింది.
యాప్‌లో సేఫ్, లేదా లో రిస్క్ అని వస్తేనే ఆఫీసుకు బయలుదేరాలని, యాప్ స్టేటస్ కనుక మోడరేట్ లేదా హై రిస్క్ అని చూపిస్తే ఆఫీసులకు రావొద్దని సూచించింది. మోడరేట్ లేదా హై రిస్క్ స్టేటస్ వచ్చిన వారంతా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని సూచించింది. స్టేటస్‌లో మళ్లీ సేఫ్ లేదా లో రిస్క్ వచ్చే వరకూ ఆయా కార్యాలయాలకు రావొద్దని స్పష్టంచేసింది.