సారథి న్యూస్, మెదక్: రాష్ట ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సింగూర్, నిజాంసాగర్ బ్యాక్ వాటర్ రైతులకు జొన్నలు, శనగల కొనుగోలు విషయంలో పట్టా పాస్ బుక్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ అధికారులకు సూచించారు. అనంతరం భారతి పెట్రోల్ పంప్ యజమాని కృష్ణ ఆధ్వర్యంలో 20 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి వెంట ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్, రేగోడ్ సొసైటీ చైర్మన్ రాజు యాదవ్ పాల్గొన్నారు.
- April 22, 2020
- లోకల్ న్యూస్
- గిట్టుబాటు
- మంత్రి హరీశ్‌రావు
- మెదక్
- వరి
- Comments Off on అన్ని పంటలకూ గిట్టుబాటు