Breaking News

అనూ.. అలా అలా!

అనూ.. అలా అలా!

అదిరే లుక్స్​తో పాటు అంతే ఫర్ఫామ్ చేస్తుంది అనూఇమ్మాన్యుయేల్. మరీ డల్​గా కాకుండా, అలా అని జెట్ స్పీడ్​కాకుండా నెమ్మది నెమ్మదిగా కెరీర్​ను మలచుకుంటూ మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది. రీసెంట్​గా బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘అల్లుడు అదుర్స్’లో జోడీ కడుతూ ఇప్పుడు అజయ్ భూపతి ద‌ర్శక‌త్వంలో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్రహ్మం నిర్మిస్తున్న ‘మహాసముద్రం’ మూవీలో కూడా హీరోయిన్ చాన్స్ దక్కించుకుందట ఈ ముద్దుగుమ్మ. ఆల్​రెడీ ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా అదితీ రావ్ హైదరి నటిస్తుండగా రెండవ హీరోయిన్​గా అను కనిపించనుందట.

‘ఆరెక్స్ 100’ తర్వాత అజయ్ తీస్తున్న సినిమా ఇది. అజయ్ పక్కాగా ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ స్క్రిప్టును తయారు చేశాడట. ప్రతి క్యారెక్టర్​కు ఇంపార్టెన్స్ ఉంటుందట. ఇద్దరు హీరోల్లో ఒకరు శర్వానంద్ కాగా మరొకరు సిద్దార్థ. అజయ్ మొదటి సినిమా బ్లాక్ బ్లస్టర్. క్యాస్టింగ్ కౌచ్​ను బట్టి రెండో మూవీ కూడా అదే స్థాయిలో ఉంటుందని అంచనా. అయితే మూవీ ఇంకా సెట్స్ మీదకి రాలేదు. నటీనటులంతా ఎంపిక తర్వాతే షూటింగ్ షురూ అవుతుందని తెలుస్తోంది.