Breaking News

అఖిల్​కు టైం కలిసిరావడం లేదట

అఖిల్​కి టైం బ్యాడ్​

అక్కినేని అఖిల్​కు టైం కలిసిరావడం లేదు. ఈ యువ హీరో నటించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వెబ్​సీరీస్​లో నటించేందుకు అఖిల్​ సిద్ధమవతున్నట్టు టాక్​. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్​ మజ్ను’ ఈ మూడు చిత్రాలు అఖిల్​ ను నిరాశపరిచాయి. అయినప్పటికీ నటుడిగా కొంతమేర గుర్తింపు పొందాడు. డాన్సులు, ఫైట్​ సీన్లలో ఎంతో బాగా చేస్తున్నాడని అక్కినేని అభిమానులు ప్రశంసలు గుప్పించారు. కానీ నటనలో కొంత పరిణతి సాధించాలని సినీ విమర్శకుల సూచన. ఈ నేపథ్యంలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్​ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 2021 సంక్రాంతి విడుదలకు రానుందని సమాచారం. అయితే ఓ ప్రముఖ నిర్మాణసంస్థ తమ వెబ్​సిరిస్​లో నటించేందుకు అఖిల్​ను సంప్రదించినట్టు సమాచారం. హిందీ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర కోసం మేకర్స్ అఖిల్​ను సంప్రదించారట. దీనికి అంగీకరించాడా లేదా? అన్నది తెలియాల్సి ఉంది.