సారథి న్యూస్, ఖమ్మం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను అరికట్టాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌కు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.
వినతిపత్రం అందజేసిన వారిలో బీజేపీ మండలాధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుద్దుకూరు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి తేజావత్ బాలాజీనాయక్, శ్రీనివాస్ రావు, పొనుగోటి రమేష్ పాల్గొన్నారు.