Breaking News

టీడీపీ నేతల దీక్షలు వృథా

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారథి న్యూస్, అనంతపురం: కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృథా అని విమర్శించారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో వారికే తెలియదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా కృషిచేశారని జేసీ దివాకర్‌రెడ్డి గుర్తుచేశారు.