Breaking News

పతంజలి కరోనా మందు చెల్లదు

జైపూర్‌‌: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా కరోనా కోసం తయారు చేసిన మందుపై చాలా చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ మెడిసిన్​ను మహారాష్ట్రలో అమ్మనివ్వబోమని మంత్రి ప్రకటించారు. కాగా ఇప్పుడు రాజస్థాన్‌ కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఆ డ్రగ్‌ను రాష్ట్రానికి పంపలేదని, దాన్ని అమ్మేందుకు పర్మిషన్‌ కూడా ఇవ్వలేదని రాజస్థాన్‌ హెల్త్‌ మినిస్టర్‌‌ రఘువర్మ చెప్పారు. ‘స్టేట్‌ గవర్నమెంట్‌ పర్మిషన్‌ లేకుండా మనుషులపై డ్రగ్‌ ట్రయల్‌ చేసేందుకు పర్మిషన్‌ లేదు. గవర్నమెంట్‌ పర్మిషన్‌ లేకుండా ఎవరైనా వాడితే చర్యలు తీసుకుంటాం’ అని వార్నింగ్‌ ఇచ్చారు.

ఎవరైనా ఆ డ్రగ్‌ను రాష్ట్రంలో విక్రయిస్తున్నారని తెలిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పతంజలి నుంచి కరోనాకు మందు కనిపెట్టామని ప్రకటించిన రామ్‌దేవ్‌ బాబా మంగళవారం దాన్ని లాంచ్‌ చేశారు. ఆ మందుతో వందశాతం వ్యాధి నయం అవుతుందని, ట్రయల్స్‌లో కూడా అది నిర్ధారణ అయిందని అన్నారు. కాగా ఆ డ్రగ్‌కు సంబంధించి వివరాలు తమకు అందించాలని ఆయుష్‌ మినిస్ట్రీ రామ్‌దేవ్‌ బాబాను కోరిన సంగతి తెలిసిందే.