క్రొయేషియా: టెన్నిస్ క్రీడలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గత వారం నిర్వహించిన ఏడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కొరిచ్ (క్రొయేషియా)లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ టోర్నీలో ఆడిన ప్లేయర్లకు వైరస్ భయం పట్టుకుంది. అలాగే మ్యాచ్‌కు హాజరైన నాలుగు వేల మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీని ఏర్పాటు చేయడంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో జొకోవిచ్‌తో కలిసి డబుల్స్ ఆడిన దిమిత్రోవ్.. సెకండ్ లెగ్ మ్యాచ్ తర్వాత జ్వరంతో బాధపడ్డాడు. దీంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన దిమిత్రోవ్.. తనతో టచ్‌లో ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. దీంతో జొకోవిచ్‌లో భయం రెట్టింపైంది. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న దిమిత్రోవ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. కరోనా భయంతో జొకోవిచ్, ఆండ్రీ రూబ్లెవ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. మరోవైపు జొకోవిచ్ ఫిట్నెస్ కోచ్ కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం. డోమ్నిక్ థీమ్, అలెగ్జాండర్ జ్వరెవ్ కూడా ఈ టోర్నీలో పాల్గొన్నట్లు సమాచారం.
- June 23, 2020
- Archive
- క్రీడలు
- CARONA
- DIMITROV
- KORICH
- TENNIS
- కరోనా
- టెన్నిస్ క్రీడ
- Comments Off on దిమిత్రోవ్, కొరిచ్కు కరోనా