Breaking News

అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

అటవీ పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా పరిధిలోని పస్రా అటవీ రేంజ్ పరిధిలోని వెంకటాపూర్ సెక్షన్ ఎల్లారెడ్డిపల్లి వెస్ట్ బీట్ 200 హెక్టార్లలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్(కంపా) ఆఫీసర్​ లోకేష్ జైస్వాల్, వరంగల్ సీసీఎఫ్ ఎంజే అక్బర్ గురువారం పరిశీలించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫొటో ప్రజంటేషన్ గ్యాలరీని ఏర్పాటుచేశారు. స్థానిక అటవీశాఖ అధికారులు పునరుద్ధరణ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ బ్లాక్ లో కందకాల తవ్వకాలు, గట్లపై ఔషధ మొక్కలు నాటాలని సూచించారు. అటవీ పునరుద్ధరణ చేపట్టిన ప్రాంతంలో ఎవరినీ అనుమతించొద్దని ఆదేశించారు. ఆయన వెంట డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి, ఎఫ్ డీవో లు నిఖిత, గోపాల్ రావు, వజ్రారెడ్డి, పస్రా రేంజ్ ఆఫీసర్ మాధవి శీతల్, వెంకటాపూర్ ఎఫ్ఎస్ వో గౌతమి, ఎఫ్ బీవోలు నవీన్, శోభన్​ ఉన్నారు.