Breaking News

వైద్యం చేయమంటే ప్రాంతీయ బేధాలు ఏందీ?

వైద్యం చేయమంటే ప్రాంతీయ బేధాలు ఏందీ?

సారథి, గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువారం మండలం చీమలకుంటపల్లి, తుమ్మవానిపల్లి, గునుకుల కొండపూర్, మోత్కుపల్లి, చొక్కాలపల్లి, గుండ్లపల్లి గ్రామస్తులు తోటపల్లి సర్కార్ దవాఖానకు పోతే అక్కడ టెస్టులు చేయడం లేదని, మీది కరీంనగర్ జిల్లా, తమది సిద్దిపేట జిల్లా అని కొందరు డాక్టర్లు, వైద్యసిబ్బంది ప్రాంతీయ బేధాలు చూపుతున్నారని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బామండ్ల రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు కి.మీ. దవాఖానాను వదిలి 33 కి.మీ. దూరంలో ఉన్న దవాఖానాకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో జ్వరం వచ్చినా, కరోనా వచ్చిందని స్థానికులు అనుకుంటున్నారని, ఆటోలు కూడా రావడం లేదన్నారు. తోటపల్లికి అందుబాటులో ఉన్న గ్రామల ప్రజలకు ఇక్కడే అన్నిరకాల టెస్టుల చేయాలని, వైద్యం అందించాలని కోరారు. ఇలాగైతే సిద్దిపేట జిల్లాలో పుట్టిన మనకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​రాజీనామా చేసి సిద్దిపేటకు పోతారా? అని ప్రశ్నించారు.